రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్.. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లలో.. ప్రయాణీకుల కోసం వేడి నీటిని సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఎప్పటికప్పడు రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం కొత్త కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణీకులకు ఈ సేవలు ఉచితంగా అందించనుంది. అయితే ప్రయాణీకులకు లగ్జరీ హోటళ్ల అనుభూతిని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Also: Funny Video: ప్లేట్ నిండా గులాబ్ జామున్ తీసుకెళ్తున్న మహిళ.. ఫోటో తీయడంతో…
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్ తొందర్లోనే ప్రయాణికులకు వేడి నీటితో స్నానం చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది రైల్వే శాఖ. ఈ అధునాతన సౌకర్యం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క స్లీపర్ వెర్షన్‌లో ప్రవేశపెట్టబడుతుంది. ఢిల్లీ నుండి కాశ్మీర్ వరకు.. రాత్రిపూట ప్రయాణం ఎక్కువగా ప్రయాణించే రూట్లలోని వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ హాట్ షవర్ సౌకర్యం కల్పించనున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. అయితే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే.. మరలా ఎటువంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read Also: Smart Tires Launch: స్మార్ట్ టైర్లను లాంచ్ చేసిన JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్
అయితే.. ఫస్ట క్లాస్ ఏసీలో మాత్రమే ప్రయాణించే వారికి ఉచితంగా ఈ హాట్ షవర్ సదుపాయాన్ని అందిస్తున్నారు. మీరు టికెట్ తీసుకున్నపుడే .. దానికి తగ్గ ఛార్జీలను యాడ్ చేస్తారు. కానీ మిగిలిన కోచ్ లలో ఈ హాట్ షవర్ లు మాత్రం అందుబాటులో ఉండదు. వందే భారత్ స్లీపర్ రైలుతో పాటు రాజధాని, దురంతో, ఇతర సూపర్‌ఫాస్ట్ రైళ్ల వంటి కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం రైళ్లలోని ఫస్ట్ ఏసీ కోచ్‌లలో అల్రెడీ వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్‌తో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు హోటల్ లాంటి సౌకర్యాలను అందిస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
