Site icon NTV Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్లో కోల్కతా లాంటి ఘటన.. నర్స్పై అత్యాచారం, హత్య

Uttarkhand Rape

Uttarkhand Rape

సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన జరిగి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయినప్పటికీ కామాంధుల కళ్లు కామంతో మూసుకుపోతున్నాయి. తాజాగా.. ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటనను పోలీసులు చేధించారు. అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ధర్మేందను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్‌లో జూలై 30న జరిగింది.

Ajit pawar: అజిత్ పవర్ కీలన ప్రకటన.. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వెల్లడి.. రంగంలోకి కుమారుడు?

మృతురాలు.. నైనిటాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె బిలాస్‌పూర్ లో తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తుంది. కాగా.. బాధితురాలి సోదరి జులై 31న రుద్రాపూర్ పోలీస్ స్టేషన్‌లో తన సోదరి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒక వారం తర్వాత.. నర్సు మృతదేహం ఉత్తరప్రదేశ్‌లోని దిబ్దిబా ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Army Dog Kent: ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన జాగిలానికి శౌర్య అవార్డు..

నిందితుడు నర్సుపై అత్యాచారం చేసి, హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అరెస్టు చేశారు. అతను ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన కార్మికుడు. కాగా.. నిందితుడు ధర్మేంద్ర నర్సును పొదల్లోకి తీసుకెళ్లి మొదట అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన ఒంటిపై ఉన్న నగలు తీసుకుని వెళ్లాడు. అయితే.. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి గురైన బాధితురాలి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయడం ద్వారా నిందితుడు ధర్మేంద్రను పట్టుకున్నారు. విచారణలో.. నర్సుపై దాడి చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. అనంతరం ఆమెను ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేసినట్లు తెలిపాడు. హత్య చేసిన తర్వాత పర్సులో ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.

Exit mobile version