Site icon NTV Telugu

Uttar Pradesh: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి వైరల్ చేస్తామని బెదిరింపు

Physical Assault On Minor Girl

Physical Assault On Minor Girl

Physical assault on minor girl in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని అలీఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఈ దారుణాన్ని సెల్ ఫోన్ కెమెరాలో చిత్రీకరించి బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి హర్దుగంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Read Also: Breath Analyser Tests: పైలెట్లు, విమాన సిబ్బందికి బ్రీత్ అనలైజర్ టెస్టులు.. డీజీసీఏ ఆదేశం

ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఓ మహిళ కూడా సహకరించింది. ప్రస్తుతం వీరందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని నిందితులు బెదిరించినట్లు బాధిత బాలిక తల్లి ఆరోపించింది. ప్రస్తుతం అత్యాచారానికి సహకరించిన మహిళతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబం నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌లు 376డి (గ్యాంగ్‌రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), పోక్సో చట్టాల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ విశాల్ కుమార్ వెల్లడించారు.

13 ఏళ్ల బాలికను ఆదివారం మధ్యాహ్నం అత్యాచారానికి సహకరించిన మహిళ తన ఇంటిలో ఓ గదిలో బంధించింది. ఆ తరువాత అక్కడుకు చేరుకున్న ముగ్గురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని మొత్తం కెమెరాతో షూట్ చేశారు. సాయంత్రం నిందితురాలు, బాధిత బాలికను తన ఇంటి నుంచి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ కేసుపై బాధితురాలి తల్లి ముందు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. నిందితులతో రాజీ కుదుర్చుకోవాలని ఒత్తడి తెచ్చినట్లు బాధిత బాలిక తల్లి ఆరోపించింది. ఆ తరువాత ఈ విషయం సీనియర్ అధికారుల దృష్టికి రావడంతో ఈ ఘటన గురించి వివరాలు తెలిశారు. పోలీసులు ఈ అత్యాచారంపై కేసు నమోదు చేసినట్లు.. విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Exit mobile version