Site icon NTV Telugu

Uttar Pradesh Minister Sanjay Nishad: దేవాలయాలకు దగ్గరలో ఉన్న మసీదులను తొలగించాలి

Sanjay Nishad Controversial Comments

Sanjay Nishad Controversial Comments

Uttar Pradesh Minister Sanjay Nishad Controversial comments: ఉత్తర్ ప్రదేశ్ మినిస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేవ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేవాలయాలకు దగ్గరలో ఉన్న మసీదును తొలగించాలని పిలుపునిచ్చాడు. భారతదేశంలో మతపరమైన ఉన్మాదం విస్తరిస్తోందని.. దేవాలయాలకు సమీపంలోని మసీదులను తొలగించానలి బుధవారం బాగ్ పత్ లో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో మదర్సాల సర్వేపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. మదర్సాలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని.. ఉగ్రవాదులు చాలా సార్లు పట్టుబడ్డారని ఆయన అన్నారు. దీంతో ముస్లిం మతపెద్దలు మదర్సాల సర్వేకు అనుమతి ఇవ్వాలని.. వారు క్లీన్ ఇమేజ్ పెంచుకోవాలని అన్నారు.

Read Also: Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం

ప్రతిపక్షాలు మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేస్తున్నాయని.. మౌలానాలతో కలిసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లర్లు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. మౌలానాలు దేశంలో పేదరికాన్ని పెంచారని.. వారి వల్లనే ముస్లిం పిల్లలు చదువుకు దూరం అయ్యారని నిషాద్ పార్టీ నాయకుడు సంజయ్ నిషాద్ అన్నారు. మౌళానాలు ముస్లిం పిల్లల చదువుకు సహకరించడం లేదని. అవగాహన కల్పించాలని కోరుకోవడం లేదని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు మతపరమైన ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ‘మౌలానా’లతో కలిసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లర్లు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదర్సాలపై సర్వేకు ఆదేశించింది. దీన్ని ప్రతిపక్షాలు ఎస్పీ, బీఎస్పీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీన్ని ‘మినీ ఎన్ఆర్సీ’గా అభివర్ణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తోందని విమర్శించారు.

Exit mobile version