Uttar Pradesh BJP leader Caught With Female Friend By Wife: అతడు ఒక బీజేపీ నేత. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అతడు.. తన బాధ్యత మరిచి, ఒక పాడు పని చేశాడు. కుటుంబ సభ్యులకు అతనిపై ఎప్పట్నుంచో అనుమానం ఉంది. ఏదైనా ఒక రోజు అడ్డంగా దొరక్కపోతాడా? అని వేచి చూసిన వాళ్లకి, ఎట్టకేలకు ఆ సమయం దొరికింది. అడ్డంగా ఆ నేతను పట్టుకున్నారు. ఇంకేముంది.. అక్కడే అతడ్ని దేహశుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బుందేల్‌ఖండ్‌కు చెందిన మోహిత్ సోంకర్ ఒక బీజేపీ కార్యదర్శి. ఇతనికి చాలాకాలం నుంచే బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో సాన్నిహిత్యం ఉంది. కొంతకాలం నుంచి వీళ్లు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా, ఏకాంతంగా కలుసుకుంటున్నారు. రోజురోజు వీరి ప్రవర్తనలో మార్పు రావడంతో.. ఇరు కుటుంబ సభ్యులకు వారిపై అనుమానం వచ్చింది. దీంతో.. రెడ్‌హ్యాండెడ్‌గా వాళ్లని పట్టుకుందామని సరైన సమయం కోసం వేచి చూశారు. చివరికి ఆ సమయం రానే వచ్చేసింది. నిన్న (ఆగస్టు 20) రాత్రి కారులో వెళ్లి పార్టీ చేసుకున్న ఆ ఇద్దరు, తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు.. వారిని వెంబడించి అడ్డంగా పట్టుకున్నారు.
బీజేపీ నేత సోంకర్‌ను అతని భార్య, అత్తింటివారు రోడ్డుపై చెప్పులతో కొట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సోంకర్ భార్య తన ఫోన్లో రికార్డ్ చేసింది. అటు.. బిందుని సైతం ఆమె భర్తతో పాటు సోంకర్ భార్య కలిసి చితకబాదారు. రోడ్డు మీద రచ్చ జరగడంతో, అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటన ఘటనాస్థలికి చేరుకొని, పోలీసులు వాళ్లని స్టేషన్‌కి తీసుకెళ్లారు. సోంకర్ భార్య, బింధు భర్త కలిసి.. వాళ్లిద్దరి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిపై దర్యాప్తు చేశాకే కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా.. సోంకర్ భార్య రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Just now #BJP Kanpur-Bundelkhand regional minister Mohit Sonkar has been caught celebrating rally in a car with his girlfriend BJP Mahila Morcha Vice President Bindu. Sonkar's wife and his family members beat Netaji with slippers. Amazing culture amazing women respect @zoo_bear pic.twitter.com/sOYU4vubNM
— iqbalmangalor (@iqbalmangalor) August 20, 2022