Site icon NTV Telugu

US Visa: ఇక శనివారాల్లోనూ అమెరికా వీసా ఇంటర్వ్యూ.. కాన్సులేట్లలో అదనపు స్లాట్లు

Us Visa

Us Visa

US Visa: అమెరికా డ్రీమ్స్ లో ఉన్నవారికి శుభవార్త చెప్పింది అమెరికా. వీసాల ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. తొలిసారి వీసా కోసం అప్లై చేసుకునే వారికి ఇది గుడ్ న్యూస్. వీసా ఇంటర్వ్యూ కోసం నిరీక్షించే వారి సమయాన్ని తగ్గించేందుకు భారత్ లోని అమెరికా దౌత్యకార్యాలయాలు తొలిసారిగా శనివారాల్లో కూడా ఇంటర్వ్యూ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 21న ఇలా శనివారం ఇంటర్వ్యూలు చేశాయి.

Read Also: Athiya Shetty-KL Rahul wedding: టీమిండియా క్రికెటర్‌ కొత్త ఇన్నింగ్స్‌.. నేడే అతియాతో కేఎల్‌ రాహుల్‌ పెళ్లి

వీసా కోసం దరఖాస్తు చేసిన వారి కోసం ఢిల్లీలో అమెరికా ఎంబసీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా కాన్సులేట్లు ప్రత్యేకంగా శనివారాలు కూడా పనిచేశాయి. రాబోయే రోజుల్లో ఎంపిక చేసిన శనివారాల్లో అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కరోనా కారణంగా వీసాల ప్రక్రియ ఆలస్యం అయిన నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టింది. గతంలో అమెరికా వీసా ఉన్న దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ లేకుండా రిమోటా ప్రాసెసింగ్ విధానాన్ని అమెరికా విదేశాంగ శాఖ అమలు చేస్తోంది.

అమెరికా ఎంబీసీ, కాన్సులెట్లలో శాశ్వత కాన్సులేట్ అధికారుల సంఖ్యను పెంచతూ నిర్ణయం తీసుకుంది. భారత్ లో 2.5 లక్షలకు పైగా బీ1/బీ2 అపాయింట్మెంట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి-మార్చ్ మధ్యకాలంలో వాషింగ్టన్, ఇతర ప్రాంతాల నుంచి భారత్ కు కాన్సులర్ అధికారులు రానున్నారు. అదనపు అపాయింట్మెంట్ల కోసం పనిగంటలను పెంచింది.

Exit mobile version