Site icon NTV Telugu

IT Jobs: భారతీయులకు అనుకూలంగా మా ఉద్యోగాలు తీసేశారు.. అమెరికన్ టెక్కీల ఆరోపణ..

It

It

IT Jobs: H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగుల కోసం తమను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు అమెరికన్ టెక్కీలు ఆరోపించడం సంచలనంగా మారింది. 20 మంది ఉద్యోగులను జాతి, వయస్సు వివక్ష ఆధారంగా తొలగించినట్లు వారు ఆరోపిస్తు్న్నారు. యూఎస్‌లో పనిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఈ ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. ఈ విషయానని ది వాల్ స్ట్రీట్ జర్నల్(WSJ) నివేదించింది. H-1B వీసాలపై ఉన్న భారతదేశానికి చెందిన వర్కర్లకు అనుకూలంగా తమను తొలగించినట్లు అమెరికన్ ఉద్యోగులు ఆరోపించారు.

టీసీఎస్ నుంచి తొలగించబడిన వ్యక్తుల్లో కాకేసియన్స్, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు ఉన్నారని, వీరంతా 40 నుంచి 60 ఏళ్లు కలిగిన వారని, వీరింతా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నివసిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. వీరిలో అనేక మంది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర అడ్వాన్సుడ్ డిగ్రీలను కలిగి ఉన్నట్లు తెలిపింది. తమ పట్ల వివక్ష చూపుతూ, హెచ్-1బీ వీసాలు ఉన్న భారతీయ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ ఐటీ దిగ్గజం చట్టాలను ఉల్లంఘిస్తోందని అమెరికన్ నిపుణులు ఆరోపిస్తున్నారు.

Read Also: Alleti Maheshwar Reddy: కోమటి రెడ్డి లాంటి 5మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు

H-1B వీసా ప్రోగ్రామ్ యూఎస్ కంపెనీల్లో పనిచేసేందుక సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. సాధారణంగా హెచ్-1బీ వీసా కలిగిన వారు మూడు నుంచి ఆరేళ్ల పాటు ఉద్యోగంలో ఉంటారు, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ పొందేందుకు, యూఎస్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన 22 మంది సమాన ఉపాధి అవకాశాల కమిషన్(ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమీషన్‘‘EEOC’’)కి ఫిర్యాదు చేశారు.

అయితే, ఈ ఆరోపణలు తప్పని తాము ఎప్పుడూ కూడా చట్టవిరుద్ధమైన వివక్షకి పాల్పడలేదని పేర్కొంది. యూఎస్‌లో సమాన అవకాశాలు కల్పించి సంస్థగా టీసీఎస్‌కి బలమైన రికార్డు ఉందని, దాని కార్యకలాపాల్లో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఒక్క టీసీఎస్ కాకుండా ఇన్ఫోసిస్, విప్రో వంటి భారత దిగ్గజ ఐటీ కంపెనీలు యూఎస్‌లో జాతి వివక్ష ఆరోపణలకు సంబంధించి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

అమెరికన్లకు చెల్లించే డబ్బుతో పోలిస్తే, అంతే స్థాయి కలిగిన భారతీయ, ఇతర ఆసియా దేశాల ఉద్యోగులు తక్కువ జీతాలకు పనిచేస్తుండటంతో కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు అమెరికన్లను కాదని వారిని నియమించుకుంటున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఐటీ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లోని పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించాయి.

Exit mobile version