Site icon NTV Telugu

USA: భారత ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తాం.. అమెరికన్ సెనెటర్ వార్నింగ్..

Usa

Usa

USA: రష్యాతో స్నేహంపై భారత్, చైనాలను భయపెడుతూ ఇటీవల అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్న వారు హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల నాటో చీఫ్ మాట్లాడుతూ.. రష్యాతో చెలిమి భారత్‌ని దెబ్బతిస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనెలటర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తాడని సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ట్రంప్ పరిపాలన చమురు సంబంధిత దిగుమతులపై 100 శాతం సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

Read Also: Lava Blaze Dragon: కేవలం రూ.10,000 లోపే 6.74 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP రియర్ కెమెరా.. లాంచ్ కు ముహర్తం ఫిక్స్..!

భారతదేశం, చైనాతో సహా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాల వస్తువులపై 500 శాతం సుంకాలను విధించాలని కోరుతూ గ్రాహం గతంలో ఒక బిల్లును ప్రతిపాదించారు. ఈ యుద్ధం కొనసాగేలా మీరు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తే భారత్, చైనా, బ్రెజిల్‌లను కూల్చేస్తాము, మీ ఆర్థిక వ్యవస్థలను అణిచివేస్తామని హెచ్చరించారు. రష్యా ముడి చమురు ఎగుమతుల్లో ఈ మూడు దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నాయని, పుతిన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా, బ్రెజిల్ చేస్తున్నది రక్తపాతం, ఎవరైనా అతడిని ఆపేలా చేసే వరకు పుతిన్ ఆగడు అని అన్నారు.

తమకు చెందని దేశాలను ఆక్రమించడం ద్వారా పుతిన్ మాజీ సోవియట్ యూనియన్‌ను తిరిగి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రాహం ఆరోపించారు. దీనికి ముందు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. బ్రిజిల్, చైనా, ఇండియా వంటి దేశాలు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ఆంక్షలు విధిస్తామని బెదిరించాడు. దీనికి ప్రతిగా భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం మా బాధ్యత అని ఇండియా స్పష్టం చేసింది.

Exit mobile version