USA: భారత ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తాం.. అమెరికన్ సెనెటర్ వార్నింగ్..
- మీ ఆర్థిక వ్యవస్థను అణిచివేస్తాం..
- రష్యా చమురు కొనడంపై యూఎస్ సెనెటర్ ఆగ్రహం..
- భారత్, చైనా, బ్రెజిల్‌లకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: రష్యాతో స్నేహంపై భారత్, చైనాలను భయపెడుతూ ఇటీవల అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్న వారు హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల నాటో చీఫ్ మాట్లాడుతూ.. రష్యాతో చెలిమి భారత్‌ని దెబ్బతిస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనెలటర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తాడని సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ట్రంప్ పరిపాలన చమురు సంబంధిత దిగుమతులపై 100 శాతం సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
భారతదేశం, చైనాతో సహా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాల వస్తువులపై 500 శాతం సుంకాలను విధించాలని కోరుతూ గ్రాహం గతంలో ఒక బిల్లును ప్రతిపాదించారు. ఈ యుద్ధం కొనసాగేలా మీరు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తే భారత్, చైనా, బ్రెజిల్‌లను కూల్చేస్తాము, మీ ఆర్థిక వ్యవస్థలను అణిచివేస్తామని హెచ్చరించారు. రష్యా ముడి చమురు ఎగుమతుల్లో ఈ మూడు దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నాయని, పుతిన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా, బ్రెజిల్ చేస్తున్నది రక్తపాతం, ఎవరైనా అతడిని ఆపేలా చేసే వరకు పుతిన్ ఆగడు అని అన్నారు.
తమకు చెందని దేశాలను ఆక్రమించడం ద్వారా పుతిన్ మాజీ సోవియట్ యూనియన్‌ను తిరిగి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రాహం ఆరోపించారు. దీనికి ముందు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. బ్రిజిల్, చైనా, ఇండియా వంటి దేశాలు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ఆంక్షలు విధిస్తామని బెదిరించాడు. దీనికి ప్రతిగా భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం మా బాధ్యత అని ఇండియా స్పష్టం చేసింది.
Lindsey Graham: Here’s what I would tell China, India and Brazil. If you keep buying cheap Russian oil… we will tariff the hell out of you and we’re going to crush your economy pic.twitter.com/x05J3G8oOk
— Acyn (@Acyn) July 21, 2025
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?