Site icon NTV Telugu

Iran: భారత్ ఆహ్వానం మేరకు వెళ్లిన నౌకను పేల్చేస్తారా.. అమెరికా దీనికి చాలా చింతిస్తుంది..

Iran Ship

Iran Ship

Iran: శ్రీలంక దక్షిణ సముద్ర తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి(సబ్‌మెరైన్) పేల్చేసింది. అయితే, ఈ ఘటనపై ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి ఖండించారు. ఈ సంఘటన ‘‘సముద్రంలో జరిగిన దారుణం’’గా ఆయన అభివర్ణించారు. ఈ నౌక భారత నేవీ ఆహ్వానం మేరకు వెళ్లి తిరిగి వస్తోందని, ఇందులో 130 మంది నావికులను తీసుకెళ్తోందని ఆయన అన్నారు.

Read Also:Vrushakarma: హాలీవుడ్ రేంజ్‌లో ‘వృషకర్మ’ గ్లింప్స్..అదిరిపోయిన నాగచైతన్య మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్

ఇరాన్ తీరానికి దూరంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడి చేసిందని అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా దీనికి తీవ్రంగా మూల్యం చెల్లించుకుంటుందని, వారు దీనిని చూసి చేదుగా పశ్చాత్తాపపడుతారు అని ఆయన హెచ్చరించారు.

ఫిబ్రవరి 18-25 వరకు బంగాళాఖాతంలో జరిగిన మిలన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఫ్రిగేట్-క్లాస్ యుద్ధనౌక IRIS దేనా పాల్గొంది. ఇండియన్ నేవీ ఆహ్వానం మేరకు ఇరాన్ నుంచి ఈ నౌక వచ్చింది. వైజాగ్ లో జరిగిన కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శ్రీలంక దక్షిణంగా హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో సబ్ మెరైన్ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో 87 మంది నౌకలో ఉన్న వారు మరణించారు. 30 మందిని శ్రీలంకన్ నేవీ రక్షించగా, మిగిలిన వారు గల్లంతయ్యారు.

Exit mobile version