Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్‌బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు. భారతదేశంలోని క్యాథలిక్ చర్చి ప్రధాన కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని మోడీ హాజరుకావడంపై ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘జీసస్ అత్యుత్తమ బహుమతి, ప్రేమకు నిదర్శనం. జీసస్ క్రీస్తును బహిరంగంగా గౌరవించినందుకు ప్రధాని మోడీకి థాంక్స్. మీ మాటలను నన్ను కదిలించాయి. భారతీయ సహోదరులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అంటూ పోస్ట్ చేశారు.
‘‘ప్రభువైన క్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం, సోదరభావాన్ని చెబుతాయి. ఈ స్పూర్తిని మరింత బలోపేతం చేయడానికి మనమందరి కృషి చేయాలి’’ అని ప్రధాని మోడీ ప్రతిస్పందించారు. 2023 జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మిల్‌బెన్ తొలిసారి ప్రధాని మోడీని కలిశారు. ఆమె 2023లో వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆమె ప్రదర్శన తర్వాత, ప్రధాని మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం ఒక్కసారి ప్రపంచ మీడియాలో వైరల్ అయింది.
Read Also: CP Avinash Mohanty : ఈ ఏడాది 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చాం..
మిల్‌బెన్ గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రజాస్వామ్య నిజమైన చర్య అని పేర్కొన్నారు. హింసించబడిని మైనారిటీలకు ఆశ్రయం కల్పించినందుకు భారత ప్రధానిని ప్రశంసించారు. భారత్‌తో మరింత దౌత్యసంబంధాలు పెంచుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశ పురోగతికి మోడీ ఉత్తమ నాయకుడని, మహిళా సాధికారత కోసం ఆయన పనిచేస్తున్నాడని ప్రశింసించారు.
సోమవారం, కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సమాజంలో హింసను ప్రేరేపించే ప్రయత్నాలను ఖండించారు, యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం మరియు సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఎత్తిచూపారు. జర్మనీలోని మాగ్డేబర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో గత వారం జరిగిన ఉగ్రదాడిని కూడా ఆయన ఖండించారు. కారు జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు, 9 ఏళ్ల చిన్నారి మరణించగా.. 205 మంది ఈ ఘటనలో గాయపడ్డారు.