US vs India: భారత్‌కు అండగా ఉండాలంటే.. పాక్‌కు సహాయాన్ని నిషేధించాలి: అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు
- సాంకేతికత బదిలీ.. ఆయుధాల సహకారంలో భారత్‌కు అండగా ఉండాలి..
- పాకిస్థాన్‌కు భద్రతా సహాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది..
- భారత్‌తో సత్సంబంధాలతోనే చైనాకు చెక్ పెట్టొచ్చు: మార్కో రుబియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US – India Relations: భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికన్ కాంగ్రెస్‌లో కీలక సభ్యుడు మార్కో రుబియో గురువారం బిల్లు ప్రవేశ పెట్టారు. అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లులో ఆయన ప్రతిపాదించారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది.. ఇందులో నిజం ఉందని తేలితే పాకిస్థాన్‌కు భద్రతా సహాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని మార్కో రుబియో స్పష్టం చేసింది.
Read Also: Janhvi Kapoor-NTR: నాకు 10 రోజులు పడితే.. ఎన్టీఆర్‌కు సింగిల్ సెకనే: జాన్వీ కపూర్
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అయితే, మరోవైపు ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణ వైఖరిని అనుసరిస్తోందని అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టిన బిల్లు స్పష్టం చేస్తుంది. ఆ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి చైనా సవాల్ చేస్తుందని మార్కో రుబియో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీని అడ్డుకోవాలంటే భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇక, అమెరికాలో నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. ఈ తరుణంలో బిల్లు గట్టెక్కడం కష్టమని నిపుణులు చెప్పుకొస్తున్నారు. భారత్‌తో సంబంధాల విషయంలో ఇరు పార్టీలూ సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వంలో ఈ బిల్లు చట్టరూపం దాల్చే ఛాన్స్ ఉంది అని నిపుణులు అంటున్నారు.
In order to strengthen our partnership with India, it’s essential we increase our strategic relationship w/ New Delhi. 🇺🇲 🇮🇳
Introduced a bill to best support India as they continue to face aggression from Communist China.https://t.co/QVF1gU7TqP
— Senator Marco Rubio: Archived (@SenMarcoRubio) July 25, 2024
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!