NTV Telugu Site icon

Antony Blinken: ఆటోలో ఆంటోనీ బ్లింకెన్.. ఆటోరిక్షాలో వచ్చి ఆశ్చర్యపరిచిన అమెరికా విదేశాంగ మంత్రి

Antony Blinken

Antony Blinken

Antony Blinken: ఇండియా ఈ ఏడాది జీ20 సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి. దీంతో పాటు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ‘క్వాడ్’ సమావేశం కూడా శుక్రవారం జరిగింది. కాగా ఢిల్లీలో జరగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. తాను ఆటోలో వచ్చిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Read Also: Husband Forces Wife: ప్రమోషన్ కోసం బాస్‌తో పడుకోమన్న భర్త.. ఆ పని చేసిన భార్య

ఈ సందర్భంగా అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేసిన అమెరికా, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోని అమెరికా కాన్సులేట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మా సిబ్బందిని కలవడం ఆనందంగా ఉందని బ్లింకెన్ ట్వీట్ చేశారు. నా పర్యటన భారత్-యూఎస్ భాగస్వామ్య శక్తిని తెలుపుతుందని, ఇండో-పసిఫిక్ ను రక్షించడంలో మా ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. భారతదేశం ఆతిథ్యానికి ధన్యావాదాలు తెలిపారు. భారత్ నిర్వహిస్తున్న జీ20 సమావేశాల్లో భాగస్వామి కావడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో క్వాడ్ విదేశాంగ మంత్రులు ఇండో-పసిఫిక్‌లో పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఆయన జపాన్ కౌంటర్ యోషిమాసా హయాషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా నియంతృత్వ ధోరణి పెరగడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే క్వాడ్ సమావేశాలను గురించి చైనా విదేశాంగ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. దేశాల మధ్య చర్చలు శాంతి, అభివృద్ధికి అనుగుణంగా ఉండాలని చైనా విశ్వసిస్తుందని అన్నారు.