NTV Telugu Site icon

US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్..!

Passport

Passport

US Embassy: అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. పర్యటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు స్టూడెంట్స్ కు ఇవి దోహదం చేస్తాయని చెప్పుకొచ్చింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.

Read Also: Stock market: పశ్చిమాసియా ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

కాగా, తాజాగా రిలీజ్ చేసిన స్లాట్‌ల వల్ల వేలాది మంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి హెల్ప్ చేస్తుందని అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అమెరికా- భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అపాయింట్‌మెంట్లను యూఎస్‌ ఎంబసీ చేపట్టింది. ప్రస్తుతం కుటుంబీకులు, బిజినెస్‌, పర్యటకులపై అమెరికా దృష్టి సారించింది.

Read Also: Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్

అలాగే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేయబోతున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఎన్ని జారీ చేసిందనే విషయంపై యూఎస్ ఎంబసీ క్లారిటీ ఇవ్వలేదు. 2023లో మాత్రం 1.4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కు వీసాలు ఇచ్చింది అమెరికా.

Show comments