US: డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు భారత్, రష్యాను మరింత దగ్గర చేయడమే కాకుండా, చైనాతో భారత స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలా చేసింది. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోడీతో పుతిన్, జిన్‌పింగ్‌లు భేటీ అయ్యారు. అయితే, ఈ పరిణామాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కి ఎక్కడా లేని కోపాన్ని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
తాజాగా, వైట్ హౌజ్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. భారత్, రష్యన్ ఆయిల్‌ని కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ‘‘బ్రహ్మణులకే లాభదాయకంగా ఉంటుంది’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోమవారం భారత్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. చాలా మంది ఈ వ్యాఖ్యల్ని ‘కులతత్వ’, ‘దుష్ట’ వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ‘‘హిందూ వ్యతిరేక’’, ‘‘భారత వ్యతిరేక’’ వ్యాఖ్యలుగా ఖండించారు. భారత్‌పై సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత నష్టదాయకంగా మారాయి.
సాధారణంగా ‘‘బొస్టన్ బ్రాహ్మణ్’’ అనేది ఒకప్పుడు అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ లోని అమెరికన్ సంపన్న ఉన్నత వర్గాన్ని సూచించడానికి విస్తృతంగా ఉపయోంచే పదం. ధనికులను సూచించేందుకు ఇంగ్లీష్‌లో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. నవారో ప్రకారం.. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఆయిల్ సంపన్నులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని, దీని వల్ల సగలు భారతీయుడికి ఎలాంటి ప్రయోజనం దక్కలేదని నవారో ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ ఆర్థిక మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, శివసేన యూబీటీ ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది కూడా ఈ వ్యాఖ్యల్ని వ్యతిరేకించారు.
