NTV Telugu Site icon

PM Modi: మోడీ క్రేజ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం క్యూ కట్టిన యూఎస్ చట్టసభ సభ్యులు

Modi

Modi

PM Modi: ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా నరేంద్ర మోడీని అడుగుపెట్టొద్దని చెప్పింది. ప్రధాని అయిన తర్వాత అమెరికానే స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కం చెబుతోంది. తాజాగా అమెరికా ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ స్టేట్ విజిల్ కి వెళ్లారు. అమెరికా ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికింది. ప్రెసిడెంట్ జో బైడెన్, ఆయన సతీమణి, ఫస్ట లేడీ జిల్ బైడెన్ వైట్ హౌజులో మోడీకి విందును ఏర్పాటు చేశారు. అనంతరం యూఎస్ కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశంలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి యూఎస్ కాంగ్రెస్ సభ్యులు స్వాగతం పలికారు.

Read Also: Opposition Meeting: నేడు పాట్నా వేదికగా విపక్షాల సమావేశం.. బీజేపీని అడ్డుకోవడమే టార్గెట్..

ఇదిలా ఉంటే మోడీ క్రేజ్ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. అమెరికన్ చట్ట సభ సభ్యులు మోడీని చుట్టుముట్టి సెల్ఫీలు, ఆటోగ్రాఫుల కోసం క్యూ కట్టారు. యుఎస్ కాంగ్రెస్‌లో దాదాపు గంటపాటు ప్రధాని మోదీ ప్రసంగించడంతో గ్యాలరీలో కాంగ్రెస్ సభ్యులు 12 మంది స్టాండింగ్ ఒవేషన్‌ ఇచ్చారు. ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ సంయుక్త సెషన్ చిరునామా బుక్‌లెట్‌పై ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

అమెరికా-భారత్ ల మధ్య బంధం బలపడుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, తీవ్రవాదం, టెక్నాలజీ, ఇండో-ఫసిఫిక్ రీజియన్ లో ఉద్రికత్త, చైనా విస్తరణ వాదం ఇలా పలు అంశాలపై ప్రధాని ప్రసంగించారు. భారతీయ అమెరికన్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మా మధ్యలో చాలా మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తలు ఉన్నారని.. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యరిస్ ను చూపిస్తూ అన్నారు. ‘సమోసా కాకస్’ ఉంటే సభకు మరింత రుచి ఉంటుందని ఆయన అన్నారు. ‘సమోసా కాకస్’ అనేది ప్రతినిధుల సభ లేదా సెనేట్‌లో భాగమైన భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుల అనధికారిక సమూహం.