India – US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసమర్థత కారణంగా భారత్, రష్యాలు మరింత దగ్గర అవుతున్నాయని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. పుతిన్ పర్యటన తర్వాత ఈ మాజీ అమెరికా అధికారి నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. ట్రంప్ చర్యల వల్ల వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య సంబంధాలు తారుమారయ్యాయని, దీనికి అమెరికా పౌరులు కూడా ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్ పొగడ్తలు లేదా లంచం వల్ల ఇది జరిగిందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
‘‘భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా ట్రంప్‌ను ఏ కారణాలు ప్రోత్సహించాయని చాలా మంది అమెరికన్లు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. బహుశా పాకిస్తాన్ పొగడ్తలు, టర్కీ, ఖతార్, దాని మద్దతుదారులు డొనాల్డ్ ట్రంప్‌కు లంచాలు ఇచ్చారు. ఇది రాబోయే దశాబ్ధాల్లో అమెరికాను వ్యూహాత్మకంగా ముంచెత్తే ఒక వినాశకరమైన లంచం’’ అని రూబిన్ అన్నారు. రష్యా చమురు కనుగోలు చేస్తున్న భారత్‌కు ఉపదేశాలు ఇవ్వడం ద్వారా అమెరికా కపటంగా వ్యవహరిస్తోందని, ఇదే అమెరికా రష్యాతో సంబంధాలు పెట్టుకుందని చెప్పారు.
Read Also: Nara Lokesh-Dallas: మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం!
‘‘భారతీయుల ప్రయోజనాలకు ప్రాధాన్యత వహించడానికే భారతీయులు ప్రధాన మంత్రిగా మోడీని ఎన్నున్నారని అమెరికన్లకు అర్థం కాలేదు. భారతదేశం అత్యధిక జనభా కలిగిన దేశం. ఇది త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా మారబోతోంది. ఇందుకు భారత్‌కు శక్తి అవసరం. రష్యా భారత్‌కు చమురును సరఫరా చేస్తోంది. అమెరికా నిజంగా భారత్‌కు సాయం చేయాలని అనుకుంటే చౌకగా ఇంధనం ఇవ్వాలి. లేకపోతే మౌనంగా ఉండటం శ్రేయస్కరం’’ అని చెప్పారు.
పుతిన్ పర్యటన తర్వాత పెంటగాన్ అధికారి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు పుతిన్ మాత్రం తమ టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేయడంతో పాటు, భారత్‌కు నిరంతరాయంగా చమురును ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ కూడా రష్యాను భారత్‌కు విశ్వసనీయం భాగస్వామిగా అభివర్ణించారు.
