NTV Telugu Site icon

India On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి అరెస్టుపై భారత్ ఆందోళన..

India On Bangladesh

India On Bangladesh

India On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మత నాయకుడు, ఇస్కాన్ నేత, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్‌ చేయడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై భారత్ ఆందోళన మంగళవారం వ్యక్తం చేసింది. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, హిందూ ఆలయాలు, హిందువుల ఆస్తులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన బంగ్లాదేశ్ హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన రిమాండ్‌ని పోలీసులకు కోరకపోవడంతో కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. అతని నిర్బంధ సమయంలో అన్ని మతపరమైన అధికారులను మంజూరు చేయాలని ఆదేశించింది.

Read Also: Kissik Song: కిస్సిక్ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డ్.. మరి అట్లుంటది ‘శ్రీలీల’తో!

సోమవారం దాస్ అరెస్టుపై పెద్ద సంఖ్యలో మైనారిటీలు తరలివచ్చి నిరసన తెలిపారు. అయితే, మైనారిటీల దాడుల్ని భారత్ ఖండించింది. ‘‘ హిందువులు, మైనారిటీలందరికి శాంతియుతతంగా సమావేశమయ్యే, భావప్రకటన స్వేచ్ఛతో సహా భద్రతనున కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరుతున్నాము’’ అని భారత్ తన ప్రకటనలో పేర్కొంది.

బంగ్లాదేశ్‌లోని 170 మిలియన్ల జనాభాలో హిందువులు దాదాపు 8 శాతం మంది ఉన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని కొత్త సైనిక-మద్దతు గల తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలపై హింసను అరికట్టడంలో విఫలమైందని విమర్శలను ఎదుర్కొంటోంది.