NTV Telugu Site icon

Anand Mahindra: IIT JEE ,UPSC పరీక్షల్లో ఏది కష్టం.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..?

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో IIT JEE , UPSC తప్పకుండా ఉంటాయి. ఎందుకుంటే వీటిని క్రాక్ చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. ఒకటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్ కోసం జరిగితే, మరొకటి సివల్ సర్వీసెస్ కోసం నిర్వహిస్తారు. అయితే, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా ‘12th ఫెయిల్’ సినిమా చూసిన తర్వాత ఈ రెండు పరీక్షలపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు కోరారు.

12th ఫెయిల్ సినిమాని ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా విధువినోద్ చోప్రా తెరకెక్కించారు. 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ వ్యక్తి ఐపీఎస్ ఎలా అయ్యారనే ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆనంద్ మహీంద్రా, విక్రాంత్ మాస్సే నటనపై ప్రశంసలు కురిపించారు.

IIT JEE , UPSC పరీక్షల్లో ఏది కష్టతరమైనదనే ప్రశ్నకు నెటిజెన్లు సమాధానం ఇచ్చారు. ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తాను యూపీఎస్‌సీ ఎగ్జామ్ కూడా రాశానని, ఐఐటీ జేఈఈతో పోలిస్తే యూపీఎస్‌సీ చాలా కఠినమైనదని చెప్పారు. పలువురు నెటిజన్లు దీనిపై స్పందించారు.

కాగా, ఆనంద్ మహీంద్రా ప్రపంచంలో 10 కష్టతరమైన పరీక్షలపై ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దీంట్లో IIT JEE 2వ స్థానంలో, UPSC 3వ స్థానంలో మరియు గేట్ 8వ స్థానంలో ఉన్నాయి. నెటిజన్లు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ ర్యాకింగ్స్‌ని అప్డేట్ చేయాలని తనదైన శైలిలో ట్వీట్ చేశారు.