NTV Telugu Site icon

Uttar Pradesh: ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య

Up

Up

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వివాహిత.. భర్త వద్ద ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయింది. దీంతో భార‌తీయ న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం.. భ‌ర్త రాజు కంప్లైంట్ చేశాడు. అయితే, ఆ బిచ్చగాడిపై మ‌హిళ‌ అప‌హ‌ర‌ణ కేసు ఫైల్ చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Read Also: Formula E Car Race Case : కోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు.. పలు చోట్ల తనిఖీలు

కాగా, హ‌ర్దోయ్‌లోని హర్పల్ పూర్ లో జీవనం కొనసాగిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వరి అనే మహిళతో పెళ్లైంది. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే, నానే పండిత్ అనే బిచ్చగాడు వారి ఇంటి పరిసరాల్లో అడుక్కునేవాడు.. కొన్ని సంద‌ర్భాల్లో భార్య రాజేశ్వరితో అతను మాట్లాడుతు ఉండేవాడని రాజు త‌న కంప్లైంట్ లో తెలియజేశాడు. ఫోన్‌లో కూడా వారు పలుమార్లు సంభాషించినట్లు చెప్పుకొచ్చాడు.

Read Also: Formula E Car Race Case : బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చలు

అయితే, జ‌న‌వ‌రి 3వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌లకి.. కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్తున్నట్లు కూతురు ఖుష్బూకు భార్య రాజేశ్వరి చెప్పినట్లు ఫిర్యాదులో రాజు తెలిపాడు. ఎప్పటికి ఆమె తిరిగి రాక‌పోవ‌డంతో భార్య కోసం వెతికాడు.. ఓ బ‌ర్రెను అమ్మితే వ‌చ్చిన డ‌బ్బుల‌తో త‌న భార్య రాజేశ్వరి వెళ్లిపోయిందన్నాడు.. ఇక, భార్యను నానే పండిట్ అనే బిచ్చగాడు తీసుకెళ్లి ఉంటాడని రాజు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో నానే పండిట్ పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 87 కింద కేసు న‌మోదు చేశారు. ఆ చ‌ట్టం ప్రకారం నిందితుడికి 10 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే ఛాన్స్ ఉంది.

Show comments