Pak-India: బోర్డర్లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!
- అటారీ సరిహద్దు దగ్గర ఉద్వేగ వాతావరణం
- పసిబిడ్డలు పాకిస్థానీయులు.. తల్లి భారతీయురాలు
- తల్లిని పాక్ వెళ్లకుండా అడ్డుకున్న భారత సైన్యం
- పిల్లల్ని తండ్రికి అప్పగిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చిన యూపీ మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు అటారీ సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం భారత సైన్యం పత్రాలను పరిశీలించి సరిహద్దు దాటించారు. అలా ఒక మహిళ.. సరిహద్దు దాటుతుండగా సైన్యం అడ్డుకుంది. ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళగా గుర్తించారు. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నందున పాక్ వెళ్లకుండా ఆపేశారు. ఇద్దరు పసిబిడ్డలను తండ్రికి అప్పగించి.. కన్నీటితో వెనుదిరిగింది.
అసలేం జరిగిందంటే..!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివాసం ఉండే సనా అనే మహిళ పాకిస్థాన్ పౌరుడిని వివాహం చేసుకుంది. 2020లో కరాచీలో డాక్టర్ అయిన బిలాల్‌ను సనా వివాహం చేసుకుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసు ఉన్న కుమార్తె ఉంది. అయితే ఇటీవల తన తల్లిదండ్రులను చూసేందుకు సనా తన పిల్లలతో కలిసి యూపీకి వచ్చింది. వివాహం అయిన తర్వాత సనా భారత్‌కు రావడం ఇది రెండోసారి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఇంతలో పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. ఆదివారంలోపు వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో అటారీ సరిహద్దుకు పిల్లలతో సనా వచ్చింది. పిల్లలకు పాకిస్థాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. సనాకు మాత్రం భారతీయ పాస్‌పోర్ట్ ఉంది. పిల్లల్ని తీసుకుని బోర్డర్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా భారత సైన్యం సనాను అడ్డుకుంది. భారతీయ పాస్‌పోర్టు ఉన్నందున పాకిస్థాన్ వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో ఆమె కన్నటిపర్యంతం అయింది. తనను పాకిస్థాన్ పంపాలంటూ బతిమాలింది. అందుకు సైన్యం అంగీకరించలేదు. దీంతో చేసేదేమీలేక సరిహద్దులో పిల్లల్ని.. భర్తకు అప్పగించి వెనుదిరిగింది. ఈ సందర్భంగా సనా ఎక్కి ఎక్కి ఏడ్చింది. తన పిల్లలు చిన్నవాళ్లని.. దయచేసి తనను వెళ్లనివ్వాలని బతిమాలింది. అందుకు సైన్యం అంగీకరించలేదు. పిల్లల్ని తండ్రికి అప్పగించేసి.. మీరట్‌కు వెనుదిరిగింది. ప్రభుత్వ ఆదేశాల కొరకు వేచి ఉండాలని సనాకు సూచించారు.
పిల్లలకు పాకిస్థాన్ పాస్‌పోర్టులు ఉన్నందున దేశం విడిచి వెళ్లాలని అధికారులు చెప్పారని సనా తెలిపింది. అయితే తనకు భారతీయ పాస్ పోర్టు ఉన్నందున తిరిగి మీరట్ వెళ్లిపోవాలని చెప్పారన్నారు. పహల్గామ్ దాడి వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని.. తనను మాత్రం పాకిస్థాన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని సనా కోరింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!