NTV Telugu Site icon

Harassment: మేనల్లుడి వేధింపులపై ఫిర్యాదు.. యూపీ మహిళను కొట్టి, గుండు గీయించారు..!

Up

Up

Harassment: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కన్నౌజ్‌లో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త మరియు అతని కుటుంబ సభ్యులు సదరు వివాహితపై దాడి చేసి తల గుండు గీయించారు. కాగా, ఈ ఘటన సెప్టెంబర్ 3వ తేదీన జరిగింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సదరు మహిళను కొంత మంది చేతులు, కాళ్లు కట్టి ఉంచి.. ఆ వివాహిత యొక్క భర్త చెక్క కర్రతో పదే పదే కొట్టడం కనిపిస్తుంది. అలాగే, నొప్పితో ఏడుస్తున్న ఆమెపై అక్కడ ఉన్న పురుషులు వంతుల వారీగా దాడి చేశారు.

Read Also: Odisha : ఒడిశాలో దారుణం..572మంది గిరిజన బాలికలు, మహిళలపై అత్యాచారం

ఇక, వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. స్థానిక పోలీసుల దృష్టికి వచ్చింది.. దీనిపై స్పందించిన పోలీసులు దాడి పాల్పడిన మహిళ భర్తతో సహా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిని సైతం అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశాం.. లోతైనా విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కనౌజ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు.

Show comments