Site icon NTV Telugu

Powermen vs policemen: పోలీసులకు తమ “పవర్” చూపించిన విద్యుత్ అధికారులు…

Uttar Pradesh

Uttar Pradesh

Powermen vs policemen: ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ విభాగాల మధ్య ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. హాపూర్‌లో విద్యుత్ అధికారులు, పోలీసుల మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. భద్స్యానా గ్రామంలో విద్యుత్ కాంట్రాక్టర్ ప్రదీప్ కుమార్, కరెంట్ వినియోగదారుడు అమర్‌పాల్‌కు మధ్య జరిగిన ఘర్షణ పూర్తిస్థాయిలో రెండు డిపార్ట్‌మెంట్ల మధ్య వివాదంగా మారింది. ఈ ఘర్షణ తర్వాత ప్రదీప్ కుమార్, అమర్‌పాల్‌ను పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది.

Read Also: Amit Shah: కాంగ్రెస్ హయాంలో 3 సార్లు “ఓట్ చోరీ”.. నెహ్రూ, ఇందిరా, సోనియా గాంధీల ఉదాహరణలు..

గంటల వ్యవధిలోనే విద్యుత్ శాఖలో ఈ పరిణామం ఆగ్రహానికి కారణమైంది. పోలీసులు అమర్‌పాల్‌ను రక్షిస్తున్నారని, తమ సహోద్యోగిని తప్పుడు ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అనేక మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది. బహదూర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డారు. పోలీస్ స్టేషన్ రూ. 3,43,974 బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ స్టేషన్‌కు నోటీసులు అంటించారు. పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పోలీస్ స్టేషన్ సమీపంలోని నివాస కాలనీ నుంచి అక్రమంగా విద్యుత్‌‌ను తీసుకుంటోందని, రూ. 3.5 లక్షల బకాయీ పెండింగ్‌లో ఉందని, కనెక్షన్ కట్ చేయడాన్ని సమర్థిస్తూ ఏఈ సూర్య ఉదయ్ కుమార్ చెప్పారు. మరోవైపు ప్రజల ఆందోళలు తీవ్రం కావడంతో సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఫిర్యాదు చేసిన తర్వాత ఇరు వర్గాల మధ్య తీవ్ర అపార్థాలు జరిగాయని అదనపు ఎస్పీ వినీత్ భట్నాగర్ చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఇప్పుడు సమస్య పరిష్కరించబడిందని ఆయన వెల్లడించారు.

Exit mobile version