UP Minister criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని 21 శతాబ్ధపు కౌరవులతో పోలుస్తూ విమర్శించారు. అయితే ఈ విమర్శలపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పాండువులు తమ సోదరిని ముద్దు పెట్టుకుంటారా.? అని ప్రశ్నించారు. ఇటీవల ఓ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకాగాంధీని ముద్దుపెట్టుకున్నారు. అయితే 50 ఏళ్ల వయసులో ఏ పాండవుడు తన సోదరిని బహిరంగ సభలో ముద్దుపెట్టుకుంటారు అని ప్రశ్నించారు.
Read Also: Termination Of Pregnancy: గర్భం రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన 14 ఏళ్ల బాలిక
ఒక సంఘ్ ప్రచారక్ పెళ్లి కాకుండా ఉంటానని ప్రమాణం చేస్తాడు.. ఎటువంటి దురాశ లేకుండా దేశనిర్మాణానికి తనను తాను అంకితం చేసుకుంటాడని ఆర్ఎస్ఎస్ గురించి చెప్పారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ని కౌరవులుగా పిలుస్తాన్నారంటే.. ఆయన పాండవుడా..? అని ప్రశ్నించారు. ఇది మన సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి అలాంటి వాటికి అనుమతి ఇవ్వదు అని దినేష్ ప్రతాప్ సింగ్ అన్నారు.
2019 లోక్ సభ్ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు దినేష్ ప్రతాప్ సింగ్. 2024 ఎన్నికల్లో సోనియాగాంధీ ఓడిపోతారని.. రాయ్‌బరేలీ నుంచి నిష్క్రమించే చివరి విదేశీయురాలు అవుతారంటూ విమర్శించారు. సోనియాగాంధీ తనకు బాగా లేదని చెబుతున్నారని.. అందుకే భారత్ జోడో యాత్రా ద్వారా కుమారుడు రాహుల్ గాంధీని ప్రోత్సహిస్తున్నారని, అతనితో కలిసి యాత్రలో నడుస్తున్నారని అన్నారు. తాను విదేశీయురాలు కాదని సోనియాగాంధీ చెప్పగలారా..? అని ప్రశ్నించారు. ఆమె విదేశీయురాలు కాదని కాంగ్రెస్ చెప్పగదా..?విదేశీయురాలు కావడం వల్లే ఆమెకు ప్రధాని పదవి ఇవ్వలేదని అన్నారు. బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు మనం చాలా కష్టపడ్డం అని.. భారతీయులు ఏ విదేశీయుడిని పాలకుడిగా అంగీకరించరని అన్నారు.
