Site icon NTV Telugu

Uttar Pradesh: పెళ్లికి నిరాకరించిన వితంతువు.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

Up

Up

Uttar Pradesh: ఇటీవల కాలంలో అమ్మాయిలు ప్రేమకు ఒప్పుకోలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని పలువురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో యువకులు పెళ్లి, ప్రేమ పేరుతో వంచించడం వల్ల అమ్మాయిలు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ మహిళ తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read Also: VarunLav: నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ – లావణ్య పెళ్లి వీడియో.. రూ. 8 కోట్లకు ఫిక్స్..?

వివరాల్లోకి వెళితే.. షామ్లీ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు, ఓ మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, అయితే అందుకు సదరు మహిళ ఒప్పుకోలేదు. దీంతో జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

వినయ్ అనే వ్యక్తి, ఓ వితంతువు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మహిళ మాత్రం అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ సోమవారం రోజు మహిళా పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్పీ అభిషేక్ తెలిపారు. 80 శాతం గాయాలయ్యాయని, ఆస్పత్రికి తరలించామని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version