Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Man Hides Mother’s Body In House For Days: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి రోజులు గడుస్తున్నా.. ఆమె మృతదేహంతోనే రోజుల తరబడి ఉన్న కుమారుడి వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గుల్రిహా ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించిన తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి ఇంట్లోనే దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే తల్లి అంత్యక్రియలను నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు వెళ్లడించారు. అయితే సదరు వ్యక్తి మద్యానికి బానిసయ్యాడని.. మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.
Read Also: Nuclear Fusion Breakthrough: కేంద్రక సంలీన చర్యలో కీలక ముందడుగు..శాస్త్రవేత్తల ప్రకటన
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శివపూర్-షాబజ్ గంజ్ సదరు వ్యక్తి ఇంటికి చేరుకున్న పోలీసులు చనిపోయిన శాంతిదేవి(82) మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మరణించిన మహిళను రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. మహిళ చనిపోయి నాలుగైదు రోజులు అయినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ కుమారుడు నిఖిల్ మిశ్రా అలియాస్ డబ్బు మద్యానికి బానిసై మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. అసలు ఇంట్లో ఏం జరిగిందో చెప్పలేకపోయాడని తెలిపారు. అయితే తన తల్లి 5 రోజుల క్రితం మరణించిందని.. డబ్బులు లేకపోవడంతోనే అంత్యక్రియలు చేయలేదని చెప్పాడు.
మిశ్రా అతని భార్య, పిల్లలు ఇదే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే మిశ్రాతో గొడవపడిన అతని భార్య 15 రోజుల క్రితమే కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అంతకుముందు కొంతమంది ఇదే ఇంట్లో అద్దెకు ఉండేవారని.. అయితే మిశ్రా ప్రవర్తన నచ్చకపోవడంతో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని.. తదుపరి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!