Site icon NTV Telugu

UP: విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్.. భార్య చెల్లితో పెళ్లి చేయాలంటూ మొండిపట్టు.. చివరికిలా..!

Upmen11

Upmen11

భారతీయ సాంప్రదాయ ప్రకారం ఒకరినే వివాహం చేసుకోవాలి. ఆమెతోనే కలకలం జీవించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు మాత్రం భార్య చెల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయాలంటూ భీష్మించాడు. విద్యుత్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించాడు. మొత్తానికి 7 గంటల తర్వాత మొండిపట్టు వీడి కిందకు దిగాడు. ఈ సంఘటన కన్నౌజ్‌లో జరిగింది.

ఇది కూడా చదవండి: Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే

రాజ్‌ సక్సేనా అనే యువకుడు 2021లో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోయింది. వెనువెంటనే ఆమె సోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెతోనైనా కాపురం చక్కగా చేస్తాడనుకుంటే కథ అడ్డం తిరిగింది. రెండేళ్ల నుంచి ఆమె చెల్లిని కూడా ప్రేమిస్తున్నాడు. గురువారం ఉదయం మరదలను పెళ్లి చేసుకుంటాని భార్యతో చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడు కోపగించుకుని విద్యుత్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు కిందకి దిగాలంటూ వేడుకున్నారు. ఎంత వేడుకున్నా దిగేందుకు నిరాకరించాడు. పెళ్లి జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మొత్తానికి 7 గంటల తర్వాత కిందకు దిగొచ్చాడు.

ఇది కూడా చదవండి: Patna: పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

 

Exit mobile version