Site icon NTV Telugu

Rs 2,700 Crore in Labourer Bank Account: రూ.100 విత్‌డ్రా చేశాడు.. ఖాతాలో రూ.2,700 కోట్లు వచ్చి చేరాయి..! కానీ..

Cash

Cash

కొన్ని సార్లు ఊహించన ఘటనలు మనిషిని అతలాకుతలం చేస్తాయి.. ఉత్తరప్రదేశ్‌లో ఓ దినసరి కూలీకి అలాంటి ఘటనే ఎదురైంది… ఏటీఎంకు వెళ్లిన రూ.100 డ్రా చేసిన ఆ కార్మికుడికి.. మీ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్టు మెసేజ్‌ రావడంతో షాక్‌ తిన్నాడు.. తీరా బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే అసలు విషయం తెలిసి నిరుత్సాహానికి గురయ్యాడు.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: Rahul Gandhi: “రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు”.. మురుగరాజేంద్ర మఠంలో ఓ స్వామీజీ!

ఒక విచిత్రమైన సంఘటనలో, ఒక రోజువారీ కూలీ ‘బిలియనీర్’ అయ్యాడు.. కానీ, ఆ ఆనందం కొన్ని గంటలకే ఆవిరైంది.. 45 ఏళ్ల బీహారీ లాల్ తన జన్‌ ధన్‌ ఖాతా నుంచి రూ.100 విత్‌డ్రా చేశాడు.. ఆ వెంటనే ఖాతాలో రూ. 2,700 కోట్ల బ్యాలెన్స్‌ని చూపించే ఎస్‌ఎంఎస్‌ తన ఫోన్‌కు వచ్చింది.. దీంతో, ఆనందంతో తబ్బిఉబ్బైయ్యాడు.. ఇటుక బట్టీల్లో పనిచేసే అతడు.. వర్షాకాలం కారణంగా ఇటుక బట్టీ యూనిట్ మూసివేయడంతో.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని తన స్వస్థలంలో ఉన్నాడు. బిహారీ లాల్ రాజస్థాన్‌లోని ఒక ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తూ రోజుకు రూ. 600 నుండి 800 సంపాదిస్తున్నాడు. తాజాగా వంద రూపాయాలు డ్రా చేసిన అతడు.. క్షణాల్లో కోటీశ్వరుడుగా మారిపోయాయని కలలుగన్నాడు.

తన ఖాతాల్లో రూ.2,700 కోట్ల బ్యాలెన్స్‌ ఉందంటూ మెసేజ్‌ రావడంతో.. బీహారీ లాల్ బ్యాంక్ మిత్ర వద్దకు వెళ్లి ఖాతాను తనిఖీ చేయించాడు.. కానీ, అందులో అంత మొత్తం లేదు.. ఆశ్చర్యపోయిన అతడు.. ఖాతాని మూడుసార్లు తనిఖీ చేయించాడు.. అతడు పదే పదే అడగడంతో.. చివరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసి కూడా ఇచ్చారు బ్యాంకు అధికారులు.. అయితే, అతని సంతోషం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది.. బ్రాంచ్‌కు చేరుకుని బ్యాలెన్స్ చెక్‌ చేయిస్తే.. అతడి ఖాతాలో రూ. 126 మాత్రమే ఉంది.. ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చిన బ్యాంక్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అభిషేక్ సిన్హా… సంబంధిత ఖాతాపై దర్యాప్తు చేయగా అందులో కేవలం రూ. 126 మాత్రమే ఉన్నాయని తెలిపారు.. ఇది స్పష్టంగా బ్యాంకింగ్ లోపం కావచ్చు అన్నారు.. అయితే, ఈ పరిణామాలతో బీహార్ లాల్ అకౌంట్‌ను కాసేపటికి సీజ్ చేశామని, ఈ విషయాన్ని బ్యాంకు సీనియర్ అధికారులకు తెలియజేశామని చెప్పారు. కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూడడం.. బ్యాంకు సిబ్బంది తప్పిదాలతో మళ్లీ ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసిన సందర్భాలు లేకపోలేదు.

Exit mobile version