Site icon NTV Telugu

UP: అక్రమ మదర్సాలు, మసీదులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..

Up

Up

UP: ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమ మసీదులు, మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఇండియా- నేపాల్ సరిహద్దుల్లోని ఉన్నవాటిపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక పోలీసులు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్‌బీ) వంటి కేంద్ర దళాల సమన్వయంతో శుక్రవారం పెద్ద ఎత్తున యాక్షన్ చేపట్టింది. అక్రమ మసీదుల్ని మూసేయడంతో పాటు ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన మతపరమైన నిర్మాణాలు కూల్చేశారు.

Read Also: Congress vs BJP: ఆ కాంగ్రెస్ ఎంపీ పిల్లలు భారతీయులు కాదు.. మండిపడిన హస్తం పార్టీ!

మహారాజ్‌గంజ్ జిల్లాలో, అధికారులు 11 మదర్సాలను సీలు చేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులు, మందిరాలతో సహా అనేక భవనాలను కూల్చేశారు. శ్రావస్తిలో గుర్తింపు లేని 41 మదర్సాలను మూసేశారు. రెవెన్యూ కోడ్‌లోని సెక్షన్ 67 ప్రకారం, ఇండో-నేపాల్ సరిహద్దు నుండి 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలతో సహా 139 అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించినట్లు అధికారులు తెలిపారు. బహ్రైచ్ జిల్లాలో, రుపైదిహ్, మోతీపూర్ వంటి సరిహద్దు ప్రాంతాలలో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయి.

Exit mobile version