Valentine’s Day: వాలెంటైన్స్ డే రోజు ప్రియుడితో పట్టుబడిన భార్య.. వీడియో వైరల్..

  • వాలెంటైన్ డే రోజు లవర్‌తో పట్టుబడిన భార్య..
  • నడిరోడ్డుపై పెద్ద గొడవ.. వైరల్ అవుతున్న వీడియో..
Up News

Up News

Valentine’s Day: ఉత్తర్ ప్రదేశ్ హాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల రోజు నాడు ఒక భర్త, తన భార్యను ప్రియుడితో పట్టుకున్నాడు. ఈ ఘటన బహిరంగ ఘర్షణకు కారణమైంది. దీనిని స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య, తన ప్రియుడితో బైక్‌పై వెళ్తుండటాన్ని చూసిన భర్త, వారిని నడిరోడ్డుపైనే ఆపేశాడు. దీంతో ప్రియుడు, భర్త మధ్య వాగ్వాదం మొదలై, ఇది భౌతిక దాడిగా మారింది.

Read Also: Tarique Rahman: బంగ్లా ప్రధాని ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. మోడీ వెళ్తారా..?

×
×
Ad

సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలాని చేరుకుని, ముగ్గురిని హాపూర్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్య, భర్త, ఆమె ప్రియుడికి మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు జోక్యం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ వినోద్ పాండే తెలిపారు. అధికారులు ఇరు వర్గాలను శాంతింపచేసి, భర్త ఆరోపణలతో ప్రియుడిపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

మీరట్‌కు చెందిన యువకుడికి, కొన్నేళ్ల క్రితం సదరు మహిళతో వివాహం జరిగింది. అదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే రోజు మహిళ, ఆమె ప్రియుడు బైక్ వెళ్తుండగా భర్త చూడటంతో గొడవ ప్రారంభమైంది.