NTV Telugu Site icon

CM Yogi: ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం, మూత్రం కలపడం చేస్తే అంతే.. ఆర్డినెన్స్ దిశగా యోగి సర్కార్..

Cm Yogi

Cm Yogi

CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్‌లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఇలాంటి ఘటనకు కఠిన శిక్షలను తీసుకువచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్డినెన్స్‌లోని నిబంధనలపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం హోం, ఆహారం, పౌర సరఫరాలతో సహా పలు శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Read Also: Defence Deal: ఇండియా-అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్‌ల ఒప్పందం.. పెరగనున్న నేవీ బలం

రెండు ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనునన్నారు. వీటికి తాత్కాలికంగా ‘‘సూడో అండ్ యాంటీ హార్మోని యాక్టవిటీస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్పిటింగ్ ఆర్డినెన్స్ -2024’’ , ‘‘ ఉత్తరప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్ ఇన్ ఫుడ్(వినియోగదారుల హక్కు) ఆర్డినెన్స్ -2024’’గా పేరు పెట్టనున్నట్లు తెలిసింది. ఈ ఆర్డినెన్స్‌లో ఆహారంలో ఉమ్మేయడం, మూత్రం కలపడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడిన వారికి శిక్షలను, వీటిని అడ్డుకునేందుకు నివారణ చర్యల్ని నిర్వచించనున్నట్లు అధికారులు తెలిపారు.

గత నెలలో తినుబండారాల్లో ఉమ్మివేయడం, మూత్రం కలపడం వంటి ఆహార కల్తీకి సంబంధించిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న యోగి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా షాపుల నిర్వాహకులు,యజమానులు తమ పేర్లను, చిరునామాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.