NTV Telugu Site icon

UP: అయోధ్యలో డ్రెనేజ్, రోడ్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్

Up Deputy Cm

Up Deputy Cm

UP: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతుంది. ఇక ఆలయాన్ని అన్ని హంగులతో ముస్తాబవోతోంది. దేశ నలుమూలల నుంచే కాదు విదేశీయులు సైతం ఈ రామమందిర ప్రారంభోత్సవానికి హాజరకానున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిథ్యనాథ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, వీధులు పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య నాలుగు రోజులు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Also Read: India-Italy: భారతీయులకు తలుపులు తెరిచిన ఇటలీ.. వేలాది మందికి ఉద్యోగాలు!

ఈ సందర్భంగా గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెనేజీలను స్వయంగా ఆయన శుభ్రం చేశారు. మురికి కాలువల నుంచి వ్యర్థాలను తొలగించారు. వీధుల్లోని చెత్తను ఎత్తి క్లీన్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా గురువారం అయోధ్యకు చేరుకున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మరోవైపు ప్రధాని మోదీ డిసెంబర్‌ 30న అయోధ్యను సందర్శిస్తారు. ఇక్కడ నిర్మించిన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. అలాగే జనవరి 22న జరిగే రామ మందిరం ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోదీ హాజరవుతారు.

Also Read: London Nanny: ఈ ఆయా జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రైవేట్ జెట్‌లో టూర్లు.. స్పెషల్‌గా డ్రైవర్ కూడా..