Uttar Prasdesh: ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు దొరికినందుకు కూతురును హత్య చేసిన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Couple Kills Daughter: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. కూతురు తప్పుడు తిరుగుళ్లు తిరుగుతుందని, మొబైల్ ఫోన్లతో అబ్బాయిలతో మాట్లాడుతుందని, ఆమెకు వేరే అబ్బాయితో సంబంధం ఉందని తల్లిదండ్రులే దారుణంగా ఆమెను హత్య చేశారు. కూతురు దగ్గర ప్రెగ్నెన్సీ కిట్లు దొరిగిన తర్వాత తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కౌశాంబి జిల్లా టెన్న్ షా అలమాబాద్ లో జరిగింది.
Read Also: Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? ఆ ప్రచారంలో నిజమెంత?
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
అలమాబాద్ కు చెందిన నరేష్, అతని భార్య శోభాదేవిలు మరో ఇద్దరు కలిసి 21 ఏళ్ల వారి కూతురు గొంతుకోసి హత్య చేశారు. నరేష్ ఇద్దరు సోదరులు గులాబ్, రమేష్ కూడా ఈ ఉదంతంలో పాలుపంచుకున్నారు. కూతురు దగ్గర ప్రెగ్నెన్సీ కిట్లు దొరికిన తర్వాత ఆమెకు వేరే అబ్బాయిలతో సంబంధం ఉందని అనుమానించి తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు శరీరంపై బ్యాటరీలోని యాసిడ్స్ పోసి కాల్చారు.
ఇదంతా చేసి తమ కూతురు కనిపించడం లేదని ఫిబ్రవరి 3న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం గ్రామం వెలుపల ఉన్న కాలువ నుంచి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురు చాలా మంది అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడుతుందని నరేష్ పోలీసులకు తెలిపాడు. కూతురు దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ కిట్లు లభించడంతో తన కూతురికి వేరే వారితో సంబంధం ఉందని కోపంతో ఉన్న తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి