NTV Telugu Site icon

Uttar Prasdesh: ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు దొరికినందుకు కూతురును హత్య చేసిన తల్లిదండ్రులు

Murder

Murder

UP Couple Kills Daughter: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. కూతురు తప్పుడు తిరుగుళ్లు తిరుగుతుందని, మొబైల్ ఫోన్లతో అబ్బాయిలతో మాట్లాడుతుందని, ఆమెకు వేరే అబ్బాయితో సంబంధం ఉందని తల్లిదండ్రులే దారుణంగా ఆమెను హత్య చేశారు. కూతురు దగ్గర ప్రెగ్నెన్సీ కిట్లు దొరిగిన తర్వాత తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కౌశాంబి జిల్లా టెన్న్ షా అలమాబాద్ లో జరిగింది.

Read Also: Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? ఆ ప్రచారంలో నిజమెంత?

అలమాబాద్ కు చెందిన నరేష్, అతని భార్య శోభాదేవిలు మరో ఇద్దరు కలిసి 21 ఏళ్ల వారి కూతురు గొంతుకోసి హత్య చేశారు. నరేష్ ఇద్దరు సోదరులు గులాబ్, రమేష్ కూడా ఈ ఉదంతంలో పాలుపంచుకున్నారు. కూతురు దగ్గర ప్రెగ్నెన్సీ కిట్లు దొరికిన తర్వాత ఆమెకు వేరే అబ్బాయిలతో సంబంధం ఉందని అనుమానించి తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు శరీరంపై బ్యాటరీలోని యాసిడ్స్ పోసి కాల్చారు.

ఇదంతా చేసి తమ కూతురు కనిపించడం లేదని ఫిబ్రవరి 3న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం గ్రామం వెలుపల ఉన్న కాలువ నుంచి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురు చాలా మంది అబ్బాయిలతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుందని నరేష్ పోలీసులకు తెలిపాడు. కూతురు దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ కిట్లు లభించడంతో తన కూతురికి వేరే వారితో సంబంధం ఉందని కోపంతో ఉన్న తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments