Site icon NTV Telugu

Neha Singh Rathore: యోగితో అట్లుంటది.. ప్రభుత్వంపై సెటైరికల్ సాంగ్.. సింగర్‌కు పోలీసుల నోటీసులు

Neha Singh Rathore

Neha Singh Rathore

Neha Singh Rathore: ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పాట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ పాడిన పాటపై యూపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాన్పూర్ లో అక్రమ ఇళ్లను తొలగింపు తల్లీకూతుళ్లు మరణానికి కారణం అయింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వాన్ని హేళన చేస్తూ నేహా సింగ్ ‘‘ యూపీ మే కా బా’’ అంటూ ఓ సాంగ్ వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ పాటపై యూపీ పోలీసులు సీరియస్ అయ్యారు. సమాజంలో అసమ్మతి, ఉద్రికత్త సృష్టించేలా పాట ఉందని ఆరోపించారు.

Read Also: Wine Shop: వైన్‌ షాప్‌లో చోరీ.. అడ్డుకున్న సెక్యూరిటీపై దాడి

ఒక్క పాటకు ఏడు ప్రశ్నలు సంధిస్తూ నేహా సింగ్ కు యూపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీడియో కనిపిస్తుంది మీరేనా..? ఆమె సాహిత్యాన్ని సమకూర్చింది మీరేనా..? మీ మాటలకు కట్టుబడి ఉన్నారా..?, వీడియో సమాజంపై చూపే దుష్ప్రభావం గురించి తెలుసా..? అంటూ ప్రశ్నలతో కూడిన ఓ నోటీసును నేహా సింగ్ కు అందించారు. దీనిపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మీ సమాధానం సరిగ్గా లేకపోతే చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు తెలిపారు.

ఈ కేసులో, కాన్పూర్ దేహత్‌లోని అక్బర్‌పూర్ కొత్వాలి పోలీసులు మంగళవారం రాత్రి అతని ఇంటి వద్ద 160 సిఆర్‌పిసి నోటీసు ఇచ్చారు. ఈ పాట ద్వారా సమాజంలో వైషమ్యాలు పెంచుతోందని పలు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు వెల్లడించారు.ఇదిలా ఉంటే 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడింది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేసింది. ఎన్నికల సమయంలో ఈ పాట పెను సంచలనంగా నిలిచింది.

Exit mobile version