UP CM Yogi Adityanath slams Rahul Gandhi over China remarks: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్-చైనా ఘర్షణలపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ లో భారత జవాన్లను చైనా సైనికులు కొడుతున్నారని రాహుల్ గాంధీ శుక్రవారం కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. భారత సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని, దేశానికి, సైన్యానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధినేత ప్రకటన అసభ్యకరంగా ఉందని విమర్శించారు.
Read Also: Pathaan: వివాదంలో షారుఖ్ ఖాన్ “పఠాన్” మూవీ.. ఈ సారి ముస్లిం బోర్డు నుంచి అభ్యంతరం
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చైల్డిష్ గా ఉన్నాయని.. దేశ వ్యతిరేక శక్తులకు స్పూర్తినిచ్చేలా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని.. డోక్లామ్ ప్రతిష్టంభన సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, భారత సైనికుల పరాక్రమాన్ని గౌరవించే బదులు కించపరుస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో రాహల్ గాంధీ చైనా రాయబారిని కలవడాన్ని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ చైనీయులను కలవడం ద్వారా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దేశం, ప్రపంచం మొత్తం భారత వీర జవాన్లు, చైనా దురాక్రమణను తిప్పి కొట్టారని చెబుతున్నా.. వారు మాత్రం నమ్మడం లేదని అన్నారు.
శుక్రవారం రాజస్థాన్ భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనా దురాక్రమణకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. భారతదేశంలో 2000 చదరపు కిలోమీటర్లు స్వాధీనం చేసుకున్నారని..ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో భారత సైనికులను కొడుతున్నారంటూ కామెంట్స్ చేశాడు రాహుల్ గాంధీ. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో భారత సైన్యం, చైనా సైన్యానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చైనా, భారత భూభాగాలను ఆక్రమించుకేందుకు ప్రయత్నిస్తే, భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘర్షణల్లో ఇరు వైపుల సైనికులు గాయపడ్డారు. అయితే భారత సైన్యం దాడిలో చైనా సైనికులు పెద్ద ఎత్తున గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా పలు కథనాలను ప్రచురించింది.