Site icon NTV Telugu

Tragedy incident: కూతురుకి “ఇన్సులిన్” కొనే స్థోమత లేదు, లైవ్‌లో తండ్రి ఆత్మహత్య..

Up

Up

Tragedy incident: ఉత్తర్ ప్రదేశ్‌లో అప్పుల బాధతో బాధపడుతున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫేస్‌బుక్ పోస్ట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. లైవ్‌లోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డయాబెటిక్‌తో బాధపడుతున్న తన కుమార్తెకు కనీసం ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనలేని అసమర్థ స్థితి ఉన్నానని లైవ్‌లోనే విలపించారు. తన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చుకుని మరణించాడు.

Read Also: MLC Kavitha : రేవంత్ రెడ్డి వాస్తు భయంతో సెక్రటేరియట్‌కు రావడం లేదు.. కానీ

తన మరణానికి కొద్దిసేపటి ముందు పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో, తన కుటుంబానికి మద్దతు ఇవ్వాలని ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను కోరుకున్నాడు. అప్పులు, ఆర్థిక బాధల్ని, ఒత్తిడిని తాను ఇకపై తట్టుకోలేనని చెప్పారు. డయాబెటిస్‌తో బాధపుడుతున్న తన కుమార్తె ప్రాణాలు రక్షించే ఇన్సులిన్ మందుల్ని కొనుగోలు చేయడానికి డబ్బు కూడా లేదని చెప్పారు.

ఈ ఫేస్‌బుక్ లైవ్ చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే సదరు వ్యక్తి తనను తాను కాల్చుకుని మరణించాడరు. ప్రాథమిక దర్యాప్తులో అతను తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక కోట్ల అప్పుల పాలైనట్లు తెలిసింది. అయితే, గార్డు తుపాకీని ఎలా పొందాడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version