Site icon NTV Telugu

Ayodhya Dham: అయోధ్య రామ మందిర పరిసరాల్లో “నాన్-వెజ్‌”పై బ్యాన్..

Ayodhya

Ayodhya

Ayodhya Dham: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ధామ్, పంచకోసి పరిక్రమ మార్గాల్లో మాంసాహారాన్ని నిషేధించింది. ఈ చర్య ద్వారా ఆ ప్రాంతంలో మతపరమైన, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది. మాంసాహార అమ్మకాలు దుకాణాల్లో, హోటళ్లలో, రెస్టారెంట్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ డెలివరీ అప్లికేషన్‌లకు కూడా వర్తిస్తుంది. దీంతో పాటు గెస్ట్‌హౌజులు, హోమ్ స్టేలలో కూడా నాన్ వెజ్ వడ్డించడాన్ని నిషేధిస్తున్నారు.

Read Also: Pakiatan: ‘‘ నెతన్యాహూను కిడ్నాప్ చేయండి’’.. ట్రంప్‌ను కోరిన పాకిస్తాన్..

ఈ ప్రాంతాల్లో ఈ నిబంధనల్ని ఉల్లంఘించకుండా నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. హోటళ్లు, దుకాణాలలో మాంసాహారం అమ్మకంపై నిషేధాన్ని ఇంతకు ముందు ప్రకటించారు. ఆన్‌లైన్‌లో మాంసాహారం ఆర్డర్ చేయడంపై ముందుగా ఎలాంటి నిషేధం లేదు. అయితే, ప్రజలు, అనేక మంది పర్యాటకుల నుంచి ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మతపరమైన మనోభావాలనున దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర యంత్రాంగం ఇప్పుడు నిషేధాన్ని ఆన్‌లైన్ అప్లికేషన్లకు కూడా వర్తింప చేసింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Exit mobile version