Site icon NTV Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా తాజా వ్యాఖ్యలు.. జోక్యం తగదన్న భారత్..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: పూర్తిగా భారత అంతర్గత విషయమైన అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికా వ్యాఖ్యలు చేయడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా చేసిన వ్యాఖ్యల్ని ‘‘అవాస్తవం’’, ‘‘ఆమోదయోగ్యం కానివి’’గా విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) పేర్కొంది. ఇటీవల అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్‌లోని ఆ దేశ దౌత్యవేత్తకు ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం తర్వాత కూడా మరోసారి ఇదే విధంగా అమెరికా వ్యాఖ్యలు చేయడంపై భారత్ గట్టిగానే స్పందించింది.

Read Also: Govinda: ఏక్‌నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?

‘‘ ఎన్నికలు, చట్టపరమైన ప్రక్రియలపై ఇతరుల జోక్యం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. భారతదేశంలో చట్టపరమైన ప్రక్రియలు చట్టబద్ధమైన పాలన ద్వారా మాత్రమే నడపబడతాయి. ఎవరైతే ఇలాంటి సారూప్యాన్ని కలిగి ఉన్న ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఈ వాస్తవాన్ని మెచ్చుకోవడంలో ఇబ్బంది ఉండకూడదు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. భారతదేశం తన “స్వతంత్ర మరియు దృఢమైన” ప్రజాస్వామ్య సంస్థల గురించి గర్విస్తోందని మరియు ఎలాంటి అనవసరమైన బాహ్య ప్రభావాల నుండి వాటిని రక్షించడానికి కట్టుబడి ఉందని MEA తెలిపింది.

‘‘మేము అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సహా ఈ చర్యలను నిశితంగా గమనిస్తున్నాము. ప్రతీ సమస్యకు న్యాయపరమైన, పారదర్శక, సమయానుకూల చట్టపరమైన ప్రక్రియల్ని మేము ప్రోత్సహిస్తాము’’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఈ రోజు అన్నారు. అంతకుముందు అమెరికా చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ దేశ దౌత్యవేత్తను భారత్ పిలిపించిన ఒక రోజు తర్వాత మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Exit mobile version