Union minister’s remarks on live-in relationship sparks row: ఢిల్లీలో 27 ఏళ్ల యువతి శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి, 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. శ్రద్ధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరు నెలల తర్వాత ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు. శ్రద్ధావిగా చెప్పబడుతున్న ఎముకలను, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపుమరకలను ఫోరెన్సిక్ టెస్టులకు పంపించారు పోలీసులు.
ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ వర్గం) నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Read Also: Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం
చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయవచ్చా..? అంటూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై స్పందించారు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్. లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేరాలకు దారి తీస్తుందంటూ.. తల్లిదండ్రులను విడిచిపెట్టి, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను ఆయన తప్పు పట్టారు. చదువుకున్న అమ్మాయిలు ఇలాంటి సంబంధాలను పెట్టుకోకూడదని సూచించారు. అమ్మాయిలు సహజీవనం ఎందుకు చేస్తున్నారని.. అలా చేయాల్సి వస్తే సరైన రిజిస్ట్రేషన్ ఉండాలని.. తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే కోర్టు మ్యారేజ్ చేసుకుని కలిసి ఉండాలని సూచించారు. శ్రద్ధా వాకర్ హత్యకు ఆమె కారణం అని అన్నారు. ఈ హత్య నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ‘‘ఆశ్చర్యకరంగా ఈ దేశంలో పుట్టడానికి మహిళలే కారణం అని చెప్పలేదు..సిగ్గు లేకుండా క్రూరంగా స్త్రీని నిందిచారు’’ అంటూ ట్వీట్ చేశారు. హత్యకు గురైన శ్రద్ధావాకర్, అఫ్తాబ్ లు ఇద్దరు 2019 నుంచి డేటింగ్ లో ఉన్నారు. మే 18న గొడవలు కావడంతో అఫ్తాబ్, శ్రద్ధాను గొంతుకోసి చంపాడు. పెళ్లి చేసుకోమని శ్రద్ధా అడినందుకు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఈ కారణంగానే అఫ్తాబ్ హత్య చేశాడు.