NTV Telugu Site icon

Waqf Issue: కేరళలో వక్ఫ్ బోర్డు వివాదం.. బాధితుల్ని పరామర్శించిన కేంద్రమంత్రి..

Waqf Land Claim

Waqf Land Claim

Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Amaran : ప్రపంచవ్యాప్తంగా 3200థియేటర్లలో రిలీజైన అమరన్

ఈ వివాదంపై సురేష్ గోపి మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరసనకారులకు మద్దతు ఇస్తుందని, వారి సమస్యల్ని పరిష్కరిస్తుందని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఉందని, అది ఆమోదం పొంది చట్టంగా మారగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వక్ఫ్ ఆక్రమణల్ని పరిష్కరిస్తామన్నారు. 2019లో తన భూముల్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసినట్లుగా బాధితులు చెప్పారు. 2022లో వారి ఆస్తులకు భూమి పన్ను చెల్లించలేరని చెప్పారని, కేరళ ప్రభుత్వం కలుగజేసుకుని పన్ను చెల్లించేందుకు అనుమతించిందని చెప్పారు.

అయితే, ఈ చర్యను వక్ఫ్ సంరక్షణ సమితి (వక్ఫ్ రక్షణ కమిటీ) కేరళ హైకోర్టులో సవాలు చేసింది. నిరసన తెలిపిన కుటుంబాలను పన్ను చెల్లించేందుకు అనుమతించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు నిలిపేసింది. బాధితులు చెబుతున్నదాని ప్రకారం.. తమ భూమిని విద్యా అవసరాల కోసం 1950లో సిద్ధిక్ సైత్ అనే వ్యక్తి ఫరూక్ కాలేజీకి ఇచ్చారు. ఇది వక్ఫ్ భూమి కాదని, కళాశాల యాజమాన్య భూమికి తాము డబ్బు చెల్లించామని చెప్పారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణ కోసం బిల్లును ప్రతిపాదించింది. దీనిని చర్చించేందుకు పార్లమెంట్ జాయింట్ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

Show comments