Site icon NTV Telugu

Union Minister Ramdas : భార్య దినోత్సవం కూడా జరుపుకోవాలి

Ramdas

Ramdas

దేశంలో ప్రతి సంవత్సరం అందరం మాతృ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటామో.. అలాగే భార్య దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని అన్నారు రిప‌బ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) అధినేత‌, కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే. మ‌హారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ఆయన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భార్య దినోత్సం గురించి ప్ర‌స్తావిస్తూ.. భార్యా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా ఆయ‌న వెల్లడించారు.

త‌ల్లి జ‌న్మ‌నిస్తున్న కార‌ణంగా మాతృ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న మ‌నం… భర్త మంచి, చెడుల‌లో భార్య పాలుపంచుకుంటుంద‌ని, అందుకే మాతృ దినోత్స‌వం త‌ర‌హాలోనే భార్యా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తి పురుషుడి విజ‌యం వెనుక ఓ స్ట్రీ ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న… ఈ కార‌ణంగానే భార్యా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Exit mobile version