Union Minister Prahlad Joshi Clarity in Parliament on Privatization of Singareni: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలిపారు. సింగరేణిలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానికే వాటా ఉందని.. అలాంటప్పుడు కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.
Read Also: Bandi Sanjay: తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించేదాకా పోరాడుతా
ప్రైవేటీకరణలో తెలంగాణ నేతలు ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంలో ఇరుకున్న నేతలే వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేలంలో వచ్చిన డబ్బంతా రాష్ట్రానికే దక్కుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అవినీతికి చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. కోల్ బ్లాక్స్ ని ప్రైవేటు కంపెనీలకు కేటాయించడంపై తెలంగాణ ఎంపీలు ప్రశ్నించారు. అయితే ఇది వేలం ప్రకారం జరుగుతోందని..దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చని కేంద్రమంత్రి అన్నారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా కోల్ బ్లాక్స్ వేలం కొనసాగుతోందని.. ఆ రాష్ట్రాలు, కేంద్రానికి సహకరిస్తున్నాయని..తెలంగాణ సమస్య ఏంటని ప్రశ్నించారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికే వెళ్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలు కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని 4 కోల్ బ్లాక్స్ కళ్యాణిఖని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ మైనింగ్ అని.. గత 20 ఏళ్లుగా లాభాల్లో ఉందని ఆయన అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వేలాన్ని తప్పుపట్టారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో కేంద్రం ఉందని ఎంపీ రంజిత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఆయన అన్నారు.
