NTV Telugu Site icon

Chirag Paswan: కేంద్రమంత్రి కారుకి రూ.2 వేల చలానా.. అతి వేగమే కారణం!

Chiragpaswan'

Chiragpaswan'

కేంద్రమంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్‌లో టోల్‌ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Rhea Chakraborty: నేను జైలులో ఉన్నప్పుడు.. నా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ తో కలిసి మందేశారు!

చిరాగ్‌ పాసవాన్‌ వాహనంలో బీహార్‌లోని హాజీపుర్‌ నుంచి చంపారన్‌కు వెళుతున్నారు. అతి ఆయన కారు.. అతి వేగంగా వెళ్లడంతో ఈ- చలానా జారీ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. జాతీయ రహదారిపై పరిమితికి మించిన వేగంతో వెళుతుండగా.. దాన్ని గుర్తించిన ఈ- డిటెక్షన్‌ సిస్టమ్‌ ఆయన వాహనానికి ఆటోమేటిక్‌ చలానాను జారీ చేసినట్లు తెలుస్తోంది. అతివేగమే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఈ చలానాతో కేంద్రమంత్రికి సంబంధం లేదంటూ చిరాగ్‌ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Paralympics 2024: భారత్‌కు మరో బంగారు పతకం.. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్

అతివేగంగా వెళ్లడం, డాక్యుమెంట్‌ లోపాలను సులువుగా ఈ- డిటెక్షన్‌ గుర్తిస్తుంది. ఈ సిస్టమ్‌‌ను బీహార్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల అమలు చేస్తోంది. ఆటోమేటిక్‌ చలానాల జారీ కోసం అన్ని టోల్‌ ప్లాజాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించేందుకు ఈ సిస్టమ్‌ను ఆగస్టు నుంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.9.49 కోట్ల జరిమానాలను జారీ అయ్యాయి. వాహనాల ఫిట్‌నెస్‌, కాలుష్య, డాక్యుమెంట్‌ లోపాలు, అతివేగంగా వెళ్లినప్పుడు చలానా జారీ అవుతుంది. జరిమానా నేరుగా కారు యాజమాని మొబైల్ నెంబర్‌కు వెళ్తుంది. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి ఈ-చలానా రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..