Union Minister Ashwini Vaishnaw on concessions in Railways: రైళ్లలో వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలై కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్. వయో వృద్ధులకు ఇచ్చే రాయితలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైల్వేలో ఫించన్లు, ఉద్యోగులు జీతాల భారం అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన పార్లమెంట్ లో వెల్లడించారు. కరోనా సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజెన్ల రాయితీని ఎప్పుడు మళ్లీ ప్రారంభిస్తారని అమరావతి ఎంపీ నవనీత్ రాణా బుధవారం లోక్ సభలో ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెబుతూ అశ్విణి వైష్ణవ్ రాయితీలపై మాట్లాడారు.
Read Also: Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేస్.. నవీన్ రెడ్డితో సహా 14మందికి రిమాండ్
ప్రయాణికుల సేవల కోసం గతేడాది ప్రభుత్వం రూ. 59 వేల కోట్లను ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడిచారు. ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువని ఆయన అన్నారు. రైల్వేలో ఏడాదికి పించన్ల కోసం రూ. 60 వేల కోట్లు, వేతనాల కోసం రూ. 97వేల కోట్లు, ఇంధనం కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో రైల్వేలో కొత్త సదుపాయాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే రైల్వేలో రాయితీని పరిశీలిస్తామని అన్నారు. ప్రస్తుతానికి అయితే రైల్వేలో రాయితీలను పునరుద్ధరించే అవకాశం లేదని.. రైల్వేల పరిస్థితిని కూడా చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను 500-550 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నామని.. స్లీపర్ సదుపాయం అందుబాటులోకి వస్తే మరింత దూరం నడిపిస్తామని వెల్లడించారు.