రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. దేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా ప్రశంసించారు. సర్దార్ పటేల్ పోరాటం వల్లే భారత్.. ప్రపంచం ముందు పటిష్టంగా నిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి జరిగిందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన చర్చలు దేశ యువతకు విద్యాబోధన కలిగిస్తాయని తెలిపారు. రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవించింది.. ఏ పార్టీ గౌరవించలేదు అనే విషయాన్ని కూడా దేశ ప్రజలకు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Winter: చలికాలంలో వేడి పుట్టించే ఇచ్చే ఆహారాలు ఇవే!
నియంతృత్వ అహంకారంతో విర్రవీగిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కళ్లద్దాలు పరాయి దేశానివైతే.. భారతీయత ఎప్పటికీ కనిపించదంటూ రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును కాలరాసేందుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో 77 సార్లు రాజ్యాంగ సవరణ జరిగిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచేశారని ఆరోపించారు. ప్రజల అభిమానాన్ని పొందలేక.. ఎన్నికల్లో ఓడిపోయి.. ఈవీఎంలను తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు.
ఇది కూడా చదవండి: Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్..!