NTV Telugu Site icon

Ajay Mishra: రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..

Ajay Mishra

Ajay Mishra

Union minister Ajay mishra Controversial comments on Farmers:కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులన్ని కుక్కలతో పోల్చడంతో పాటు.. రైతు నేత రాకేష్ టికాయత్ ను బీ గ్రేడ్ వ్యక్తిగా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి. తనపై వస్తున్న విమర్శలు తప్పని తన సహచరులతో మాట్లాడుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు

నేను లక్నోకు కారులో వేగం వెళ్తున్నాను అనుకోండి..కుక్కలు అరుస్తాయి.. కారు వెంటపడుతాయి.. అది వాటి అలవాటు అని అన్నారు. మాకు అలాంటి అలవాటు లేదని కాబట్టి వాటి గురించి మేము ఎక్కువగా మాట్లాడమని అన్నారు. మీ మద్దతు వల్లే నేను ధైర్యంగా ఉన్నానని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రశ్నల్ని లేవనెత్తుతుంటారని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టులు వారికి మద్దతుగా నిలిచి గందరగోళానికి గురిచేస్తారని వ్యాఖ్యానించారు. రాకేష్ టికాయత్ గురించి నాకు బాగా తెలుసని.. ఆయన ఓ బీ గ్రేడ్ వ్యక్తి అని.. అలాంటి వారు చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదని.. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని.. అలాంటి వ్యక్తుల అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనిని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై రాకేష్ టికాయత్ స్పందించారు. కొడుకు జైలుకు వెళ్లిన ఆక్రోశంలో ఉన్న ఆయన ఇలా మాట్లాడటం సాధారణమే అని అన్నారు.

గతేడాది కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేశారు. అయితే ఆ సయమంలో యూపీలో లఖీంపూర్ ఖేరీ ఘటన జరిగింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఆందోళన చేస్తున్న రైతులపైకి వాహనాలను వేగంగా నడిపి నలుగురు రైతులు చనిపోయిన ఘటనకు కారణం అయ్యాడు. ఈ ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటన కోర్టులో విచారణలో ఉంది.

Show comments