Site icon NTV Telugu

Covid-19: కొవిడ్‌ కట్టడిపై పలు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ

Covid Cases

Covid Cases

Covid-19: దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఆరోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు. అర్హత గల అందరికీ టీకాను వేగంగా అందించడమే లక్ష్యంగా ఉండాలన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచాలన్నారు. కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని.. కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

గడిచిన 24గంటల్లో 19,406 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 49 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 19,928 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ కేసులను ముందస్తుగా గుర్తించడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. కొవిడ్ ప్రోటోకాల్ ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. కొవిడ్ క్లస్టర్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

Exit mobile version