NTV Telugu Site icon

Lok Sabha: ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

Loksabha

Loksabha

పార్లమెంట్‌లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్‌ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. దశాబ్దాల కాలం నుంచి మనుగడలో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు కేంద్రం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేయగానే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.