Site icon NTV Telugu

PM Modi: నేడు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలై చర్చించే అవకాశం ఉంది. జాతీయ భద్రతా, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నారు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ కారణంగా భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండనుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం, విమాన ప్రమాద నివారణ చర్యలపై కూడా చర్చించనున్నరు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: Thammudu : ‘త‌మ్ముడు’ మూవీలో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన చిన్నారి ఎవరో తెలుసా..!

ఇదిలా ఉంటే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి, అనంతరం పాకిస్థాన్‌పై మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టారు. వీటిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి. అందుకు కేంద్రం ససేమిరా అంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మంత్రివర్గంలో కీలకంగా చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: Outsourcing Staff: ఉద్యోగుల నియామకాలపై మంత్రుల బృందం ఆరా.. వారంలో మరోసారి భేటీ!

Exit mobile version